కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం తలపెట్టింది. దేశ వ్యాప్తంగా సోమవారం నాడు ఆందోళనలకు పిలుపునిచ్చారు. అయితే అనుమతి లేకపోవటంతో పోలీసులు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరు నేతలు అందరూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వడానికి కూడా వీలులేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.