టిఆర్ఎస్ ఎల్పీ సమావేశం 7న

Update: 2020-09-03 15:07 GMT

అసెంబ్లీ సమావేశాలకు అధికార టీఆర్ఎస్ రెడీ అవుతోంది. గురువారం నాడు మంత్రులు..విప్ లతో సన్నాహాక సమావేశం నిర్వహించిన సీఎం కెసీఆర్ సెప్టెంబర్ 7న టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ భవన్ లో సాయంత్రం ఐదు గంటలకు ఈ సమావేశం జరగనుంది. దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డి మరణానికి టిఆర్ఎస్ ఎల్పీ సంతాపం తెలుపుతుంది. ఆయనకు నివాళి అర్పిస్తుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు.

Similar News