ఏసీబీకి చిక్కిన మెదక్ అదనపు కలెక్టర్ నగేష్

Update: 2020-09-09 06:02 GMT

1.12 కోట్లకు డీల్...40 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి

ఓ వైపు రెవెన్యూ శాఖలో సంస్కరణల కోసం సర్కారు భారీ ప్రక్షాళనకు నడుంకట్టినట్లు ప్రకటించింది. బుధవారం నాడు కొత్త రెవెన్యూ చట్టాన్ని కూడా ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ తరుణంలో ఓ భూ వివాదానికి సంబంధించి మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ భూ వివాదం పరిష్కారానికి 1.12 కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకుని..తొలి విడతగా నలభై లక్షల రూపాయల నగదు తీసుకున్నారు.

ఈ నగదు తీసుకునే సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం డబ్బులు ఇస్తారో లేదో అన్న అనుమానంతో అదనపు కలెక్టర్ నగేష్ ఏకంగా ఒప్పంద పత్రాలు రాసుకోవటంతోపాటు..బ్లాంక్ చెక్కులు కూడా తీసుకున్నారు. నగేష్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాల్లో ఇవి వెలుగు చూశాయి. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. 113 ఎకరాల ల్యాండ్ ఎన్ వోసీ కోసం ఈ డబ్బులు డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

 

Similar News