వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శలపై బిజెపి చాలా వేగంగా స్పందించింది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఆమె జాతీయ నాయకురాలో..జాతి నాయకులో స్పష్టమైంది అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ బిజెపి ఇన్ ఛార్జి సునీల్ ధియోదర్ స్పందించారు. ‘కుల మతాలకు అతీతంగా దేశ నిర్మాణానికి పనిచేసే పార్టీ బిజెపి.. మీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే పురంధేశ్వరిపై కులం పేరుతో దాడి చేస్తారా?. అర్హత చూసి ఆమెకు ఇచ్చిన బాధ్యతను కులంతో ముడిపెడతారా? అన్నీ కులమయం చేసిన వైసీపీ కులాల గురించి మాట్లాడటం ఎబ్బెట్టుగా ఉంది.’ ట్వీట్ చేశారు.