ఎన్ డిఏకు శశిథరూర్ కొత్త నిర్వచనం

Update: 2020-09-22 14:31 GMT

కేంద్రంలోని ఎన్ డీఏ సర్కారుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యంగాస్త్రాలు సంధించారు. ఎన్ డి ఏ అంటే ‘ నో డేటా ఎవైలబుల్’ అని ఓ కార్టూన్ ను షేర్ చేశారు. అందులో ఒక్కో అక్షరానికి ప్రధాని మోడీ, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్ షా ఫోటోలను కూడా జోడించారు. లాక్ డౌన్ లో ఎంత మంది వలస కార్మికులు చనిపోయారంటే సమాచారం లేదని చెబుతున్నారని..రైతుల ఆత్మహత్యలపై అదే పరిస్థితి అని విమర్శించారు. ఆర్ధిక ఉద్దీపనకు సంబంధించి తప్పుడు లెక్కలు చెబుతున్నారని, కోవిడ్ 19 మరణాలపై దొంగ లెక్కలు అని ఆరోపించారు. జీడీపీపైనా అవే లెక్కలు అని విమర్శించారు.

Similar News