నా ప్రతిపాదనకు మంత్రులు..ఎమ్మెల్యేలు ఓకే చెప్పారు

Update: 2020-09-08 16:13 GMT

ఏపీ మంత్రి కొడాలి నాని అమరావతిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన రాజధానిని కూడా అమరావతిలో ఉంచాల్సిన అవసరం లేదని తాను చేసిన సూచనకు తమ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలిపారని అన్నారు. సింగపూర్ కంపెనీలకు 1500 ఎకరాలు ఇవ్వగా తప్పులేనప్పుడు, 55 వేల మంది పేదలకు 1500 ఎకరాల భూమి ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఆయన ఓ ఛానల్ తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకునే కమ్యూనిస్టుల మాటలు ఎవరు వింటారు?. అని ప్రశ్నించారు.

తన దిష్టిబొమ్మలు దహనం చేస్తే ఏమి అవుతుందని అన్నారు. పేదలు ఉండని చోట చట్టసభలు ఎందుకు? అని ప్రశ్నించారు. తన ఆలోచన బాగుందని సీఎం జగన్ కూడా అన్నారని తెలిపారు. ఇప్పటికైనా రైతులు ప్రభుత్వంతో మాట్లాడితే మంచిదని సూచించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు మూడేళ్ళలో ఎందుకు నిర్మాణాలు చేపట్టలేదని.. అప్పుడు చంద్రబాబు కాలర్ ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు.

 

 

Similar News