కొత్త గా మరో 80 రైళ్లు

Update: 2020-09-05 16:02 GMT

ప్రస్తుతం ప్రయాణికుల అవసరాలు తీరుస్తున్న ప్రత్యేక రైళ్లకు తోడు కొత్తగా మరో 80 రైళ్ళు అందుబాటులోకి రానున్నాయి. కరోనాకు ముందు తరహాలో రైళ్ళు నడపటానికి ఇంకా కొంత సమయం పడుతుందని రైల్వే శాఖ ప్రకటించింది. కొత్తగా అందుబాటులోకి రానున్న 80 ప్రత్యేర రైళ్లకు సంబంధించిన బుకింగ్ సెప్టెంబర్ 10న ప్రారంభించనున్నారు. ఈ రైళ్ళు సెప్టెంబర్ 12 నుంచే ప్రారంభం కానున్నాయి.

అన్‌లాక్‌ 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా జారీచేసిన మార్గదర్శకాలను పాటిస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ప్రయాణికుల కోసం 80 రైళ్ళను అందుబాటులోకి తేనున్నట్లు రైల్వేబోర్డు చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Similar News