హరీష్ రావు కు కరోనా పాజిటివ్

Update: 2020-09-05 05:37 GMT

తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. కొద్దిగా లక్షణాలు కన్పించగా..పరీక్ష చేయించుకన్నట్లు తెలిపారు. పరీక్షలో కరోనా పాజిటివ్ గా వచ్చిందని,, గత కొద్ది రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారు ఐసోలేషన్ లో ఉండటంతోపాటు...పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న తరుణంలో ఆర్ధిక మంత్రి హరీష్ రావుకు కరోనా నిర్దారణ కావటంతో ఆయన సమావేశాలకు దూరంగా ఉండకతప్పని పరిస్థితి నెలకొంది. శాసనసభ్యులతోపాటు మంత్రులు అందరికీ కూడా కరోనా పరీక్షలు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. సభలోకి ఎవరు అడుగు పెట్టాలన్నా నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News