విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత గద్దె బాబూరావు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన గత కొంత కాలంగా పెద్దగా పార్టీ కార్యక్రమాల్ల కూడా చురుగ్గా పాల్గొంటున్నది కూడా లేదు. రాజీనామాకు సంబంధించి ఆదివారరం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘పార్టీలో పరిస్థితులు బాగోలేవు. సుదీర్ఘ కాలంగా టీడీపీలో పనిచేసినా గుర్తింపు లేదు. ఆత్మ గౌరవం.. ఆత్మ స్థైర్యంతో పుట్టిన పార్టీ ప్రస్తుతం కనుమరుగైంది. అందుకే రాజీనామా చేస్తున్నా. ఎన్టీఆర్ ఉన్నప్పుడు పార్టీ వేరు.. ఇప్పుటి టీడీపీ వేరు. చంద్రబాబు నాయుడు మాలాంటి వారికి గౌరవం ఇవ్వడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.