కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం

Update: 2020-09-04 11:10 GMT

ఇంటెలిజెన్స్ నివేదికలతో ఏపీ సర్కారు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. భద్రతా కారణాల దృష్టా ఇంటెలిజెన్స్‌ నివేదిక ఆధారంగా హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పది రోజుల క్రితం మంత్రి కన్నబాబుకు బీపీ (బుల్లెట్ ప్రూఫ్) వాహనం కేటాయించాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు నివేదిక ఇచ్చాయి. మంత్రి కన్నాబాబు ఇక నుంచి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలోనే ప్రయాణాలు, పర్యటనలు చేపట్టాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు సూచించాయి.

Similar News