కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా

Update: 2020-08-30 15:13 GMT

ఏపీలో కరోనా కేసుల ఉధృతి ఏ మాత్రం తగ్గటం లేదు. గత కొన్ని రోజులుగా రోజుకు పది వేలకుపైనే పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. తాజాగా వైసీపీకి చెందిన కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఆయన హోం ఐసోలేషన్ కు వెళ్లారు.

దివంగత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ సెప్టెంబర్ 1, 2 తేదీల్ల పులివెందులలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అందులో భాగంనే ప్రజా ప్రతినిధులతోపాటు మీడియా సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులోనే అవినాష్ రెడ్డికి వైరస్ ఉన్నట్లు తేలింది.

Similar News