జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో గాజువాకలో పవన్ కల్యాణ్‌ని‌ చిత్తుగా ఓడించారని..అందుకే ఆయనకు వైజాగ్ అంటే కసి అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన బినామీ ఆస్తుల విలువ పెంచుకోవడం కోసమే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. సెంటిమెంట్ నిరూపించుకోవాలంటే ఎవరైతే ఆ సెంటిమెంట్ నమ్ముతారో వారే రాజీనామా చేసి వారి చిత్తశుద్ధి చూపించాలన్నారు చంద్రబాబు చెప్పే మాయ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.

రోజా సోమవారం నాడు తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతోమాట్లాడుతూ మా అన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాఖీ శుభాకాంక్షలు. మహిళల భద్రత కోసం వైఎస్‌ జగన్ కృషి చేస్తున్నారు. రాఖీ పండగ సందర్భంగా మహిళల భద్రతకు మరో అడుగు ముందడుగు వేశారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం శుభ పరిణామమన్నారు.