మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం నాడు ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం నాడు ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్ 19 నెగిటివ్ అని తేలింది. ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడికి తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
దీంతో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఆయన శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మాడకు బయలుదేరి వెళ్లారు. ఆస్పత్రిలో అచ్చెన్నాయుడిని గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు పరామర్శించారు.