జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీ వ్యక్తిని అన్నారు. రాజోలు వైసీపీ గ్రూపుల్లో తనదో గ్రూపు అని..ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని గ్రూపులకు చెక్ పెట్టాలన్నారు. పార్టీలో కుమ్ములాటలు మంచిది కాదన్నారు. అంతే కాదు జనసేన ఓ వర్గానికి చెందిన పార్టీ అని వ్యాఖ్యానించారు.
గత ఎన్నికల్లో తనకు వైసీపీ టిక్కెట్ రాకపోవటం వల్లే జనసేనలో చేరాల్సి వచ్చిందని తెలిపారు. గత కొంత కాలంగా రాపాక వరప్రసాద్ జనసేనతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పలు సందర్భాల్లో ప్రశంసల వర్షం కురిపించారు. భవిష్యత్లో జనసేన పార్టీ ఉనికే ఉండదు అని వ్యాఖ్యనించారు.