అమరావతిలో పెద్ద ఇళ్లు..ఆఫీస్ కట్టి జగన్ మోసం చేశారు

Update: 2020-08-01 11:34 GMT

ఒక భట్రాజును పక్కన పెట్టుకున్నారు అధికారాలు అన్నీ ఆయనవే

ఆయన సాటి అధికారులను అవమానిస్తున్న తీరు దారుణం

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పెద్ద ఇళ్లు, ఆఫీస్ కట్టుకుని ప్రజలను మోసం చేశారని అన్నారు. ఇవి చూసిన అందరూ జగన్ కు చిత్తశుద్ధి ఉందని నమ్మి అంత పెద్ద మెజారిటీతో పట్టం కట్టారని అన్నారు. తొలుత జగన్ అమరావతి శంకుస్థాపనకు రాకపోతే అందరూ ఆయన వ్యతిరేకం అనుకున్నారని..చంద్రబాబుకు అమరావతిలో సొంత ఇళ్లు లేకపోయినా..జగన్ కట్టుకోవటంతో ప్రజలంతా గుడ్డిగా ఆయన్ను నమ్మారని అన్నారు. రఘురామకృష్ణంరాజు మూడు రాజధానుల అంశంపై ఢిల్లీలో శనివారం నాడు మీడియాతో మాట్లాడారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు దక్షిణాఫ్రికాను చూసి విభజించిన..అది కూడా 13 జిల్లాలకు పరిమితమైన ఏపీలో మూడు రాజధానులు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు జరిగేదే 45 రోజులు అని..అందులో మళ్ళీ ఒక సెషన్ వైజాగ్ లో అంటున్నారని తెలిపారు.

కర్నూలు జ్యుషియల్ క్యాపిటల్ అన్నంత మాత్రాన అది రాజధాని అయిపోతుందా?. అసెంబ్లీతో అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ అయిపోతుందా? అని ప్రశ్నించారు. జగన్ ఈ అంశంపై రిఫరెండం నిర్వహించే వరకూ మూడు రాజధానుల నిర్ణయాన్ని నెల రోజుల పాటు వాయిదా వేయాలని కోరారు. రిఫరెండంలో ఆయనకు అనుకూలంగా నిర్ణయం వస్తే చివరకు అమరావతి రైతులు కూడా మౌనంగా ఉంటారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రతి ఒక్క నిర్ణయం సీఎం ఆఫీసులో ఉన్న ఒకే ఒక వ్యక్తి ..మన పార్టీ డౌన్ ఫాల్ కు అతనే కారణం. చాలా చాలా అన్యాయం జరుగుతోంది. ఒక భట్రాజును పక్కన పెట్టుకుని అతనికి పవర్స్ అన్నీ ఇచ్చి సాటి అధికారులను అవమానిస్తున్న తీరు అందరూ గమనిస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

 

Similar News