48 గంటలు..359 కోట్ల సమీకరణ

Update: 2020-08-14 14:34 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్ధిగా బరిలో నిలిచిన జో బైడెన్ సమీకరించిన మొత్తం ఇది. ఆయన 48 గంటల్లో 359 కోట్ల రూపాయలు (48 మిలియన్ డాలర్లు) సమీకరించారు. భారతీయ మూలాలు ఉన్న కమలా హారిస్ ను ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత ఆయన ఈ మొత్తం సమీకరించటం విశేషం. కమలా హారిస్ ఈ పదవికి పోటీపడుతున్న తొలి నల్ల జాతి మహిళ. ఆమె తల్లి భారతీయురాలు కాగా, తండ్రి జమైకాకు చెందిన వ్యక్తి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆమె మూలాలను ప్రశ్నిస్తూ అసలు కమలా హ్యారిస్ పోటీకే అర్హురాలు కాదనే వాదన తెరమీదకు తీసుకొచ్చారు. గత కొన్ని రోజులుగా అమెరికాలో నల్లజాతీయులు వర్ణ వివక్షపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసుల చేతిలో జార్జి ఫ్లాయిడ్ మరణించిన తర్వాత ఇది దేశమంతటికి విస్తరించింది. ఈ తరుణంలో జో బైడెన్ ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ ను ఎంపిక చేయటం అత్యంత కీలక పరిణామంగా మారింది.

Similar News