జగన్ చుట్టూ కట్టప్పలు

Update: 2020-08-18 11:39 GMT

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రోజుకొక అంశంతో మీడియా ముందుకు వస్తున్నారు. ఆయన ఢిల్లీలో మకాం వేసి మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ చుట్టూ కట్టప్పలు ఉన్నారని..ఆయన వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కట్టప్పలను గుర్తించకపోతే ప్రమాదమని హెచ్చరించారు. ‘అవినీతిని ఏమాత్రం ప్రోత్సహించని ముఖ్యమంత్రిగా మీకు పేరుంది, కానీ మీ పక్కనే ఉంటూ.. అవినీతికి పాల్పడుతున్న కట్టప్పను మీరు పట్టుకుని తీరాలి.

సినిమా కాబట్టి బాహుబలిని కట్టప్ప పొడిచేశాడు. ఈ కట్టప్పను మీరు కనిపెట్టాలి. మీపైనే రాష్ట్ర ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు.మీపై ఉన్న విశ్వసనీయతను కాపాడుకోవాలి అంటే.. అతి త్వరలో ఆ కట్టప్పను పట్టుకుని శిక్షించాలి. అలాంటి కట్టప్పలు చాలా మందే ఉన్నారు. మీ పక్కన ఉంటూ పనికిరాని మాటలు చెబుతూ, వారిపై వీరిపై చాడీలు చెబుతూ.. ప్రజలను నిలువెత్తు దోపిడీ చేస్తున్న వారిని మీరు కనిపెట్టి శిక్షించాలి’’ అని కోరారు.

Similar News