సచివాలయం కూల్చివేతలు చూస్తాం..అనుమతించండి

Update: 2020-08-07 08:20 GMT

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనుల పరిశీలనకు అనుమతించాల్సిందిగా కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటీషన్ ను పిల్ గా మార్చి హైకోర్టు విచారణకు స్వీకరించింది. కూల్చివేతల అంశంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి జీ బ్లాక్ కింద ఉన్న గుప్త నిధుల కోసమే రహస్యంగా కూల్చివేతలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు ఆయన గతంలో మీడియాలో వచ్చిన పలు వార్తల క్లిప్పింగ్ లను కూడా చూపారు. దీంతోపాటు సచివాలయంలోని నల్లపోచమ్మ గుడి, మసీదు కూల్చివేతలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో ఎంపీ రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలిసి పిటీషన్ దాఖలు. సచివాలయం పరిశీలనకు అనుమతి కోరుతూ రేవంత్ రెడ్డి జులై 29న డీజీపీ మహేందర్ రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ లకు లేఖ రాశారు. దీనిపై ఎలాంటి స్పందన లేకపోవటంతో మరోసారి లేఖ రాశారు. అయినా కూడా స్పందన లేకపోవటంతో అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించారు.

 

Similar News