మళ్లీ వైసీపీలో చేరిన చలమలశెట్టి సునీల్

Update: 2020-08-31 11:47 GMT

వైసీపీ నుంచి టీడీపీలోకి. ఇప్పుడు టీడీపీలో నుంచి వైసీపీలోకి. ఇది చలమలశెట్టి సునీల్ జంపింగ్ ల తీరు. గత ఎన్నికల్లో సునీల్ టీడీపీ తరపున కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీచేసి వైసీపీ అభ్యర్ధి వంగా గీత చేతిలో ఓటమి పాలయ్యారు. సునీల్ సోమవారం నాడు వైసీపీ అధినేత, సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అప్యాయంగా కౌగిలించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Similar News