ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన

Update: 2020-08-06 08:52 GMT

రాజధాని ఏర్పాటులో కేంద్రం పాత్ర లేదు

అమరావతి వ్యయంపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతికి సంబంధించి గురువారం నాడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్రం రాజధాని అంశంపై తన వైఖరిని లిఖితపూర్వకంగా హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించింది. రాజధాని ఏర్పాటు విషయంలో కేంద్రం పాత్రేమీలేదని ప్రకటించింది. ఇది రాష్ట్ర పరిధిలోని అంశమని పేర్కొంది. రాజధాని కేంద్రం పరిధిలోని అంశమంటూ పి వి కృష్ణయ్య దాఖలు చేసిన పిటీషన్ కు సంబంధించి విచారణలో భాగంగా కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపింది. ఏపీ సర్కారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై హైకోర్టులో పలు కేసులు నడుస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే హైకోర్టు ధర్మాసనం ఇఫ్పటివరకూ అమరావతిలో చేసిన వ్యయానికి సంబంధించిన అంశంపై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇఫ్పటికే రాజధానిలో 52 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సీఆర్ డీఏ రికార్డును న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా..దీనికి సంబంధించి సమగ్ర వివరాలు అందించాలని ఆదేశించింది. ఇది ప్రజల సొమ్ము అని..కట్టిన భవనాలు వాడకపోతే అవి పాడైపోతాయని వ్యాఖ్యానించింది. ఆ నష్టం ఎవరు భరిస్తారు అని ప్రశ్నించింది. ఈ కేసు ఆగస్టు 14న విచారణకు రానుంది.

Similar News