మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కరోనా

Update: 2020-07-20 05:23 GMT

తెలంగాణలో మరో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఎమ్మెల్యేతో పాటు ఆయన భార్యకు, కుమారుడు, పనిమనిషికి కూడా కరోనా అని పరీక్షల్లో వెల్లడైంది. దీంతో తనను కలసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఎమ్మెల్యే వివేకానంద కోరారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులందరినీ 14 రోజుల హోం ఐసోలేషన్ లో ఉండాల్సిందిగా సూచించారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తెలంగాణ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.

Similar News