పవర్ స్టార్ హీరో పేరు ‘ప్రవణ్ కళ్యాణ్’ అంట

Update: 2020-07-14 16:16 GMT

రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ సినిమాకు సంబంధించి మరో కొత్త లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమా హీరో పేరును ‘ప్రవణ్ కుమార్’గా పరిచయం చేశారు. అంతే కాదు ప్రవణ్ కళ్యాణ్ ఎంతో అద్భుతమైన నటుడు అని..ఇతర స్టార్ లతో పోలిస్తే ఎంతో పవర్ ఫుల్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. గత కొంత కాలంగా రామ్ గోపాల్ ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ విడుదల చేస్తూ హంగామా సృష్టిస్తున్నారు. దీనిపై ఓ వైపు ఆర్జీవీ పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

అచ్చు పవన్ కళ్యాణ్ ను మరిపించేలా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి..అది టైటిల్ కూడా పవర్ స్టార్ అని పెట్టి తీయటం అంటే ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా వర్మ దీనిపై వివాదాలు కోరుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. అంతే కాదు..పవర్ స్టార్ టైటిల్ మధ్యలో జనసేన పార్టీ గుర్తు అయిన గ్లాసు పెట్టడం ఒకెత్తు అయితే..ఎన్నికల ఫలితాల తర్వాత అంటూ ట్యాగ్ లైన్ ను జత చేయటంతో ఇది అంతా టార్గెట్ గా సాగుతున్న వ్యవహారంగా కన్పిస్తోంది. సినిమాలు చకచకా చుట్టేయటంలో వర్మను మించిన వారు లేరు. మరి ఈ కరోనా సంక్షోభ సమయంలో వర్మ ఎప్పుడు సినిమాను విడుదల చేస్తారో వేచిచూడాల్సిందే.

Similar News