దేశంలోనే అత్యధిక అత్యధిక వేతనం పొందుతున్న బ్యాంకర్ ఎవరో తెలుసా?. అగ్రశ్రేణి ప్రైవేట్ బ్యాంక్ హెచ్ డీఎఫ్ సీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఆదిత్యపూరి. ఆయన 2019-20 సంవత్సరానికిగాను వేతనంగా 19 కోట్ల రూపాయలు పొందారు. దీనికి తోడు స్టాక్ ఆప్షన్ కింద ఆయనకు 161 కోట్ల రూపాయలు పొందారు. ఇక్కడ సీన్ కట్ చేసి..దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్ బిఐ చీఫ్ విషయం చూస్తే షాక్ అవ్వాల్సిందే.
ఎస్ బిఐ ఛైర్మన్ రజనీష్ కుమార్ 2019-20 సంవత్సరం కాలానికి కేవలం 31.2 లక్షల రూపాయల వేతనం మాత్రమే పొందారు. ఓ అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ సీఎండీ వేతనానికి..ప్రభుత్వ రంగంలోని అతి పెద్ద బ్యాంక్ ఛైర్మన్ వేతనాల మధ్య తేడా ఎలా ఉందో గమనించాల్సిందే. కొద్ది రోజుల క్రితం ఈ వేతనాలపై ఎస్ బిఐ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కూడా.