నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన అనగనగ ఒక రాజు ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపింది. ఈ సినిమా జనవరి 14 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షుకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తోలి రోజు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 22 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడించింది. రాజు గారు వచ్చారు ... అసలైన సంక్రాంతి సంబరాలు తెచ్చేసారు అంటూ కలెక్షన్స్ పోస్టర్ ను విడుదల చేసింది. మారీ దర్శకత్వంలో తెరకెక్కిన అనగనగ ఒక రాజు మూవీ లో నవీన్ పోలిశెట్టికి జోడిగా మీనాక్షి చౌదరి నటించిన సంగతి తెలిసిందే.
వీళ్లిద్దరి కాంబినేషన్, పాటలు కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి. మధ్యలో బుల్లి రాజు సందడి...ఎక్కువ శాతం కామెడీతో సినిమా అంతా సాఫీగా సాగిపోతుంది. వీటికి తోడు క్లైమాక్స్ లో కొంత ఎమోషన్స్ కూడా పెట్టి సినిమానే బాగానే నడిపించటంతో ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఈ మూవీ కి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇదే జోష్ కంటిన్యూ అయితే నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన సినిమా ఒకటి తొలిసారి 100 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్ లో చేరే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి వచ్చిన మూవీ ల్లో పాజిటివ్ టాక్ దక్కించుకున్న సినిమాలో ఇది కూడా ముందు వరసలో ఉంది.