కరోనా సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మహంకాళి ఉజ్జయిని మాత భవిష్యవాణి స్వర్ణలత భవిష్యవాణి విన్పించారు. ‘ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు రా.కాపాడుకుందాం అనుకున్నా కానీ మీ చేతులారా చేసుకుంటున్నారు. నాకు సంతోషం లేదు. రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరంగా ఉన్నాయి ముందుగానే హెచ్చరిస్తున్నా.నా భక్తులనీ , నా బిడ్డలను కాపాడుకుంట’ అని ప్రకటించారు. అదే సమయంలో మహంకాళి ఉజ్జయిని మాత భవిష్యవాణి స్వర్ణలత ఐదు వారాలు పూజలను కోరారు. ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా నిర్వహించే రంగంలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు.