కరోనా పరీక్షల్లో ఏపీ రికార్డు

Update: 2020-07-05 16:05 GMT

ఆంధ్రప్రదేశ్ సర్కారు కరోనా పరీక్షల విషయంలో కొత్త రికార్డును నమోదు చేసింది. ఆదివారం నాటికి రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షలు పది లక్షలను దాటేశాయి. మొత్తం పరీక్షలు 10,17,140కు చేరాయి. కరోనా పరీక్షల విషయంలో దేశంలోనే ఏపీ రెండవ స్థానంలో నిలిచింది. మిలియన్ కు సగటు పరీక్షల్లో మొదటి స్థానంలో ఢిల్లీ ఉండగా, ఏపీ రెండవ స్థానంలో ఉంది. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ పరిస్థితి ఈ విషయంలో దారుణంగా ఉంది. తెలంగాణ బీహార్ తో మాత్రమే పోటీపడుతుంది.

ఢిల్లీలో పది లక్షలకు గాను 32863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఏపీలో పది లక్షలకు 18597 పరీక్షలు నిర్వహించారు. 16663 పరీక్షలతో తమిళనాడు మూడవ స్థానంలో నిలిచింది. అదే తెలంగాణలో పది లక్షలకు గాను 2637 పరీక్షలు మాత్రమే నిర్వహించారు. బీహార్ లో ఈ సంఖ్య 2197గా నిలిచింది. ఏపీలో రికవరీ రేటు కూడా సంతృప్తికరంగా ఉంది.

Similar News