చర్చలు జరిపి వేల కోట్లు ఆదా చేశాం

Update: 2020-06-12 16:20 GMT

ప్రభుత్వ ఆస్తులను ఇష్టానుసారం కట్టబెట్టడం కాకుండా బాధ్యతతో వ్యవహరించటం ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆదా చేస్తున్నట్లు సీఎం ముఖ్యసలహాదారు అజయ్ కల్లాం తెలిపారు. గత ప్రభుత్వంలో కుదిరిన గ్రీన్ కో ప్రాజెక్టు ఒఫ్పందాన్ని సవరించటం ద్వారా ఈ ప్రాజెక్టు జీవితంలో కాలం ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు సేవ్ చేసినట్లు వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ అదే విధంగా చేయగలిగినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రాజెక్టు డెవలపర్ జీఎంఆర్ ను ఒఫ్పించామని అజయ్ కల్లాం వెల్లడించారు. ఒప్పదంలో విమానాశ్రయ డెవలపర్ కు 2700 ఎకరాలు ఇవ్వాలని ఉండగా..తాము సంప్రదింపులు జరిపి 500 ఎకరాలు తగ్గించినట్లు తెలిపారు.

ప్రస్తుతం అక్కడ ధర 3 కోట్ల రూపాయలు ఉందని..ఈ లెక్కన 1500 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు అయిందని అజయ్ కల్లాం వివరించారు. విమానాశ్రయం పూర్తయిన తర్వాత ఎకరం పది కోట్ల రూపాయలకు చేరుతుందని..అంటే అప్పుడు 5 వేల కోట్ల రూపాయలు మిగిల్చినట్లు అవుతుందని తెలిపారు. గత ప్రభుత్వం లో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా రూ. 2072 కోట్ల 29 లక్షల ప్రజా ధనాన్ని తమ ప్రభుత్వం ఆదా చేసిందని వెల్లడించారు.

Similar News