అన్నీ రాసుకుంటున్నాం..వడ్డీతో సహా చెల్లిస్తాం

Update: 2020-06-15 06:34 GMT

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సోమవారం నాడు అనంతపురంలో జె సీ కుటుంబాన్ని పరామర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల రిజిస్ట్రేషన్, బీమా గోల్ మాల్ అంశానికి చెందిన కేసులు మాజీ ఎమ్మెల్యే జె సీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంపై లోకేష్ సోమవారం నాడు జె సీ ప్రభాకర్ రెడ్డి తనయుడు పవన్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

జెసీ బ్రదర్స్ కు ట్రావెల్స్ వ్యపారం కొత్త కాదన్నారు. తమిళనాడు తరహా రాజకీయాలు ఏపీకి వచ్చాయని వ్యాఖ్యానించారు. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదని విమర్శించారు. జెసీ ప్రభాకర్ రెడ్డిపై తప్పులు కేసులు పెట్టారని ఆరోపించారు. దొంగ కేసులు పెడితే భయపడే పరిస్థితి లేదన్నారు. ఫిబ్రవరి నుంచి ఇఫ్పటి వరకూ 22 కేసులు పెట్టారని లోకేష్ విమర్శించారు. జె సీ ప్రభాకర్ రెడ్డి ఏమీ ఆర్ధిక నేరస్తుడు కాదన్నారు. తొందర్లోనే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులపై దాడి చేస్తే ఊరుకునేదిలేదన్నారు.

 

Similar News