సుప్రీంకు చేరిన ఎస్ఈసీ వివాదం

Update: 2020-06-01 15:21 GMT

మలుపుల మీద మలుపులు తిరుగుతున్న ఏపీ ఎస్ఈసీ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. గత కొన్ని రోజులుగా ఏపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు..కొత్త ఎస్ఈసీ గా కనగరాజ్ నియామకం..హైకోర్టులో కేసు దాఖలు వంటి అంశాలు అత్యంత కీలకంగా మారాయి. తాజాగా ఏపీ హైకోర్టు ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని..అదే సమయంలో కొత్త ఎస్ఈసీగా కనగరాజ్ నియామకం కూడా రద్దు అయినట్లు ప్రకటించింది.

దీంతో వెంటనే రమేష్ కుమార్ తాను బాధ్యతలు స్వీకరించినట్లు ప్రకటించారు. కానీ సర్కారు మాత్రం ఏజీ సలహాతో అది చెల్లుబాటు కాదని..రమేష్ కుమార్ జారీ చేసిన సర్కులర్ ను రద్దు చేసేసింది. సోమవారం నాడు ఏపీ సర్కారు ఎస్ఈసీకి సంబంధించి చెలరేగిన వివాదం, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటీషన్ ను దాఖలు చేసింది.

Similar News