తగ్గినట్లే తగ్గుతున్నాయి. మళ్ళీ పెరుగుతున్నాయి. ఇది తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల పరిస్థితి. శనివారం నాడు రాష్ట్రంలో కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1061కి చేరుకుంది. శనివారం నాడు కరోనాతో ఒకరు చనిపోయారు. దీంతో కరోనా వ్యాధి కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 29 మంది మృతి చెందినట్లు అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది.