రాష్ట్రంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గటంలేదు. ఆదివారం నాడు కొత్తగా మరో 42 కేసులు వెలుగుచూశాయి. ఇందులో 37 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండగా, వలస కార్మికులు ముగ్గురు, రంగారెడ్డిలో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం నాడు కరోనా నుంచి కోలుకుని మరో 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 992 మందికి చేరింది. మరణాలు 34 ఉంటే...రాష్ట్రంలో ఇఫ్పటి వరకూ నమోదు అయిన మొత్తం కేసుల సంఖ్య 1551కు పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 525 ఉన్నాయి.