తెలంగాణలో కొత్తగా 47 కేసులు

Update: 2020-05-14 15:46 GMT

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1414కు పెరిగింది. కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో జీహెచ్ఎంసీలో 40 కేసులు ఉంటే..కొత్తగా రంగారెడ్డి జిల్లాలో 5 కేసులు, వలస కార్మికులు ఇద్దరు ఉన్నారు. గురువారం నాడు మరో 13 మందిని డిశ్చార్జి చేశారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 952కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 428 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా తెలంగాణలో మరణాలు 34 అని సర్కారు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు.

Similar News