జీహెచ్ఎంసీ కేంద్రంగా తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. కొత్తగా మంగళవారం నాడు మరో 51 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. అందులో 37 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా, మరో 14 మంది వలస కార్మికులు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1326కు చేరింది. మంగళవారం నాడు కరోనా నుంచి కోలుకుని 21 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 822 మంది. ప్రస్తుతం 472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇఫ్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 32 మంది మరణించినట్లు హెల్త్ బులెటిన్ లో తెలిపారు. కరోనా సోకిన వలస కార్మికుల్లో 12 మంది యాదాద్రిలో ఉండగా, 2 జగిత్యాలలో ఉన్నారు.