తెలంగాణ మంత్రివర్గ సమావేశం శనివారం మధ్యాహ్నాం మూడు గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానుంది. రాష్ట్రంలో కరోనా కేసులు..నివారణ కు చేపట్టిన చర్యలు...భవిష్యత్ లో చేపట్టాల్సిన చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. దీంతోపాటు లాక్ డౌన్ కొనసాగింపు పై మంత్రివర్గంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కొద్ది రోజుల క్రితం జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం కెసీఆర్ స్పష్టంగా లాక్ డౌన్ పొడిగించటమే మేలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటే కాస్త ఆలశ్యంగా అయినా రికవరి చేసుకోవచ్చని..కానీ ప్రజల ప్రాణాలు పోతే మాత్రం రివకరి చేయలేం కదా అని వ్యాఖ్యానించారు. కరోనా నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు – భవిష్యత్ వ్యూహ రూపకల్పన, రాష్టంలోని పేదలు – ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులకు అందుతున్న సాయం, వ్యవసాయ కొనుగోళ్లు- వడగండ్ల వాన నష్టం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.