తెలంగాణలో మరో ఏడు కేసులు

Update: 2020-04-29 16:12 GMT

మంగళవారం నాడు ఏడు కేసులు. బుధవారం నాడు కూడా ఏడు కరోనా పాజిటివ్ కేసులు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1016కు పెరిగింది. ఇప్పటికే 409 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్ళకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 582 మాత్రమే ఉన్నాయని సర్కారు హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 20 రోజుల చిన్నారి కరోనా పాజిటివ్ తో ఆస్పత్రిలో చేరి..విజయవంతంగా కోలుకుని గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడని తెలిపారు. ఇప్పుడు ఆ బాలుడి వయస్సు 45 రోజులు అని తెలిపారు.

ఆ బాలుడే దేశంలోని అతి పిన్నవయస్కుడిగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. తండ్రి నుంచి వైరస్ సోకినా..విజయవంతంగా కోలుకుని బయటకు వెళ్లాడన్నారు. అసలు రాష్ట్రంలో జీరో యాక్టివ్ కేసులు ఉన్న జిల్లాలుగా సిద్ధిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, నారాయణపేట్, వనపర్తి, పెద్దపల్లి, వరంగల్ (రూరల్), భద్రాద్రి, నాగర్ కర్నూలు, ములుగు, యాదాద్రి జిల్లాలు ఉన్నాయి.

 

 

 

 

 

Similar News