తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

Update: 2020-04-22 14:45 GMT

తెలంగాణలో కరోనా కేసుల ఉదృతి తగ్గినట్లే కన్పిస్తోంది. బుధవారం నాడు కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 943కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 725 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటికే 194 మంది డిశ్చార్చ్ అయ్యారు. బుధవారం నాడు కరోనా కారణంగా ఒకరు చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ లో తెలిపారు. కొత్తగా వెలుగుచూసిన 15 కేసుల్లో 10 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా, సూర్యాపేటలో 3, గద్వాల్ లో 2 కేసులు నమోదు అయ్యాయి.

Similar News