ఎస్ఈసీ తొలగింపు వివాదం..ఈ నెల20న విచారణ

Update: 2020-04-13 08:20 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వివాదంపై దాఖలైన పిటీషన్లను హైకోర్టు సోమవారం నాడు విచారింది. ఈ నెల 16కు ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణ మళ్ళీ వచ్చే సోమవారం నాడు జరగనుంది. ఏపీ సర్కారు తాజాగా ఎస్ఈసీ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్ళకు తగ్గిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయటం, ఆ వెనువెంటనే ప్రస్తుత ఎస్ఈసీ రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసిందని ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతోపాటు కొత్త ఎస్ఈసీగా రిటైర్డ్ జడ్జి కనగరాజ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయటంతో ఆయన వెంటనే బాధ్యతలు కూడా చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాలను సవాల్ చేస్తూ మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనతోపాటు ఇదే అంశంపై పలు ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 

Similar News