వాళ్లపై ఫిర్యాదు చేయండి..పవన్ కళ్యాణ్

Update: 2020-04-09 12:11 GMT

కరోనా విస్తృతి ఉన్న వితప్కర సమయం ఇది. ఈ సమయంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయటం మన ఉద్దేశం కాదు. సంయమనం పాటిస్తూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అధికారుల నుంచి తగిన సహాయం, సేవలు అందేలా చూడాలి. లాక్ డౌన్ తర్వాతే రాజకీయాలు, పాలనలోని వైఫల్యాల గురించి మాట్లాడదాం. పేద కుటుంబాలకు వెయ్యి రూపాయలు పంపిణీ చేసిన తీరు, స్థానిక ఎన్నికల్లో వైసీపీ తరపున నిలబడ్డ అభ్యర్ధుల ద్వారా పంపిణీ చేయించటంపై పీఏసీ సభ్యులు, నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు. నాయకులు తమ పరిధిలో చోటుచేసుకున్న ఇలాంటి ఘటనలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయండి’ అని సూచించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన గురువారం నాడు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తోపాటు సభ్యులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి ఒక ప్రాంతానికో..రాష్ట్రానికో సంబంధించిన అంశం కాదన్నారు. అంతర్జాతీయంగా ఉన్న ఈ పరిణామంపై రాష్ట్ర ప్రభుత్వం నాన్ సీరియస్ గా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలకు అవసరమైన భరోసా కల్పించలేకపోతోందని..మంత్రులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకుడా పర్యటనలు చేస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ సూచనల మేరకు జనసేన కార్యకర్తలు చాలా చోట్ల పేదలకు సాయం చేస్తున్నారన్నారు.

 

Similar News