ఎవరూ బయటకు రావొద్దు..కెసీఆర్

Update: 2020-04-18 15:54 GMT

తెలంగాణలో కరోనా కేసులు 809

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అమలు చేస్తున్న పద్ధతులను యథావిధిగా అమలు చేయాలని కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నందున మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. కంటైన్మెంట్ల నిర్వహణ బాగా జరగాలి. ఆ ప్రాంతాల్లో ఎవరినీ ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానీయవద్దు. రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారు నివసిస్తున్న ఇతర ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ వ్యూహం రూపొందిచుకోవాలి. వైరస్ సోకిన వారి ద్వారా ఇంకా ఎవరికి సోకవచ్చు అనే విషయాలను ఖచ్చితంగా నిర్థారించి పరీక్షలు జరపాలి.

ఎంత మందికైనా పరీక్షలు జరపడానికి, ఎంత మందికైనా చికిత్స చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 809కు పెరిగింది. ఒక్క శనివారం రోజే మొత్తం 43 కరోనా పాజిటివ్ కేసులు రాగా..జీహెచ్ఎంసీ పరిధిలోనే 31 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే 186 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 605 యాక్టివ్ కేసులు ఉన్నాయని హెల్త్ బులెటిన్ లో తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా కారణంగా 18 మంది చనిపోయారు.

 

 

Similar News