ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆరోగ్యం విషమం!

Update: 2020-04-21 05:55 GMT

అగ్రరాజ్యం అమెరికాను కూడా గడగడలాడించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జింగ్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారా? ప్రస్తుతం ఆయన అసలు బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారా..అంటే ఔననే వార్తలు వెలువడుతున్నాయి. కిమ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. సోమవారం రాత్రి సమయంలో ఆయన తీవ్ర అస్వస్థత గురైనట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కిమ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. ఇటీవల ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్‌ హాజరుకాని విషయం తెలిసిందే.

దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర చర్చ మొదలైంది. గత నెల రోజులుగా కిమ్ జంగ్ ఉన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు అంటే..ఆయన తీవ్ర అనారోగ్యం పాలు కావటం వల్లే అనే అనుమానాలు మరింత బలపడ్డాయి. కిమ్ ఆరోగ్యం ఉంటూ నిత్యం ఏదో ఒక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. అయితే కిమ్ ఆరోగ్య పరిస్థితిపై దక్షిణ కొరియా మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయటం లేదు.

 

 

 

Similar News