హైదరాబాద్ లో భారీ వర్షం

Update: 2020-04-09 11:42 GMT

హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండ..ఉక్కబోత ను చవిచూశారు నగర ప్రజలు. కానీ గురవారం సాయంత్రం అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షంతోపాటు ఈదురుగాలులు వీచాయి. వర్షం పడినా కూడా ఉక్కబోత మాత్రం ఆగలేదు. నగరంలోని ఖైరతాబాద్, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మెహిదీపట్నం, నిజాంపేట్‌, కేపీహెచ్‌బీ, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్, కూకట్‌పల్లి, మూసాపేట్‌, ఈసీఐఎల్‌, నాగారం, జవహార్‌ నగర్‌, కీసరలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

Similar News