సిర్పూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య అనారోగ్యంతో గురువారం నాడు మృతి చెందారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. టీఆర్ఎస్ తరపున ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత కొంత కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.