అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 11 ఉదయం 9.45 గంటలకు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 5,01,680కు చేరగా..మరణాలు 18,780కు పెరిగాయి. ఒక్క శుక్రవారం నాడే తొలిసారి అమెరికాలో రెండు వేలకు పైగా మరణాలు నమోదు అయ్యాయి. న్యూయార్క్ లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. చివరకు చనిపోయిన వారి అంతిమ సంస్కారాలకు అవసరమైన చోటు దొరక్క సామూహిక ఖననం చేస్తున్న విషయం తెలిసిందే.
న్యూయార్క్ లో ఏకంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,74,489కు పెరిగింది. ఇక్కడ మృతులు 7887 ఉన్నాయి. న్యూజెర్సీలో కరోనా కేసులు 54,588 ఉంటే ఇక్కడి మరణాలు 1932 ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాలో అతి తక్కువ కేసులు ఉన్న ప్రాంతం ఒహియో. ఇక్కడ 5878 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితే...మరణాలు 231గా ఉన్నాయి.