సీఏఏపై అసెంబ్లీలో చర్చిస్తాం

Update: 2020-03-07 07:58 GMT

కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిలకు సంబంధించి ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పిన మాటలు వందకు వంద శాతం వాస్తవం అని ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఉన్న హక్కు ప్రకారం జీఎస్టీ డబ్బుల గురించి మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని అన్నారు. కేంద్రంపై అక్బరుద్దీన్ విమర్శలు చేస్తున్న సమయంలో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దశలో సీఎం కెసీఆర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఎవరూ ఆవేశాలకు లోను కావాల్సిన అవసరంలేదన్నారు. సీఏఏపై చాలా అనుమానాలు ఉన్నాయని కేసీఆర్‌ అన్నారు.

సీఏఏపై అసెంబ్లీలో చర్చిస్తామని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశాయని గుర్తుచేశారు. సీఏఏను పార్లమెంటులోనే వ్యతిరేకించినట్లు పేర్కొన్నారు. ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌, సీఏఏపై దేశంలో అతిపెద్ద చర్చ జరుగుతోందని తెలిపారు. ప్రతి పార్టీ తమ వైఖరిని సీఏఏపై స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం తన వైఖరి మార్చుకుంటుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే ..ఎవరి విధానం ఏంటో ప్రజలు తెలుసుకుంటారని వ్యాఖ్యానించారు.

 

Similar News