కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నాడు కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే సానుకూల అంశం ఏమిటంటే సోమవారం నాడు 13 మంది కరోనా వైరస్ నుంచి బయటపడి డిశ్చార్జి అయ్యారు. అదే సమయంలో కరోనా కారణంగా ఒక మరణం కూడా నమోదు అయింది. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య రెండుకు చేరింది. మొత్తం మీద తెలంగాణలో ఇప్పటి వరకూ 77 మందికి కరోనా వైరస్ సోకినట్లు అయింది.