జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్...హైదరాబాద్ లో మెట్రో బంద్

Update: 2020-03-21 08:08 GMT

హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ‘జనతా కర్ఫ్యూ’లో భాగంగా ఆదివారం నాడు హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు బంద్ చేయనున్నారు. మెట్రో కు అనుబంధంగా ఉన్నా ఎల్ అండ్ టీ మాల్స్ ను కూడా మూసి వేస్తున్నారు. ప్రజలంతా కూడా జనతా కర్ఫ్యూ లో పాలు పంచుకోవాలి. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుండి బయటకు రావొద్దు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి.

కరోనా నేపథ్యంలో మెట్రో రైళ్ళను ప్రతి 3 గంటలకు ఒకసారి శానిటైజ్ చేస్తున్నాం.’ అని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో మెట్రో పాటు అన్ని సేవలు పూర్తిగా బంద్ కానున్నాయి.

Similar News