తెలంగాణలో మరో కొత్త కరోనా పాజిటివ్ కేసు

Update: 2020-03-18 08:42 GMT

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం నాడు కొత్తగా మరో పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణలో ఈ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ఇటీవలే యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా అతనికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 1,83,579 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 7,900 మందికి పైగా మరణించారు. భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు 137కు పైగా నమోదవ్వగా.. ముగ్గురు మరణించారు.

 

Similar News