కరోనా సాయం కోసం అనుపమ నాదెళ్ల 2 కోట్ల విరాళం

Update: 2020-03-24 12:14 GMT

తెలంగాణలో కరోనా వైరస్ విస్తృతిని నివారించటంతోపాటు అవసరమైన వారికి నిత్యావసర వస్తువుల సరఫరా కోసం అనుపమ నాదెళ్ల రెండు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. అనుపమ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ భార్య. ఈ రెండు కోట్ల రూపాయల విరాళాన్ని అనుపమ తండ్రి, రిటైర్డ్ ఐఏఎస్ కె ఆర్ వేణుగోపాల్ మంగళవారం నాడు ముఖ్యమంత్రి కెసీఆర్ కు అందజేశారు. అనుపమతోపాటు ఇఫ్పటికే ప్రకటించిన పది లక్షల రూపాయల విరాళం చెక్కును హీరో నితిన్ కూడా సీఎం కెసీఆర్ కు అందజేశారు.

ఈ సందర్భంగా కెసీఆర్ వీరందరినీ అభినందించారు. ఇదిలా ఉంటే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో టీజీవో అధ్యక్షుడు రవీందర్ గౌడ్- సెక్రటరీ జనరల్ మమత లు కేసీఆర్ తో భేటీ అయ్యారు. కరోనా వ్యాప్తి నివారణకు ఒక రోజు జీతాలను సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగాల సంఘాల ఒక రోజు జీతాలు 36 కోట్లు అని తెలిపారు.

 

Similar News