ఆ దేశాలకు ఎయిర్ ఇండియా సర్వీసులు రద్దు

Update: 2020-03-13 12:49 GMT

కరోనా దెబ్బ విమానయాన సంస్థలను కూడా దారుణంగా దెబ్బతీస్తోంది. ఎయిర్ ఇండియా పలు దేశాలకు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, దక్షిణకొరియా, శ్రీలంకలకు సర్వీసులు రద్దు చేశారు. ఏప్రిల్ 30 వరకూ ఈ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది.

ఇప్పటికే భారత్ ఏప్రిల్ 15వరకూ పలు దేశాలకు చెందిన పౌరులకు వీసాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోకి కరోనా కేసుల సంఖ్య పెరగకుండా ముందు జాగ్రత్త చర్యల కింద ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు అయినా సరే నెల రోజుల పాటు దేశంలో ప్రవేశించటానికి అనుమతించరు.

Similar News