ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు

Update: 2020-02-10 08:05 GMT

ఆంద్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. అయితే ఈ చార్జీల పెంపు నుంచి పేద, మధ్య తరగతి ప్రజలకు మినహాయింపు కల్పించారనే చెప్పాలి. కేవలం 500 యూనిట్లు పైబడిన వాడకం దార్లకు మాత్రమే వర్తించేలా ఛార్జీల పెంపు ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్తగా ఛార్జీలను యూనిట్‌కు 90 పైసలు ప్రభుత్వం పెంచింది.

ఈ పెంపుతో ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలపై భారం పడనుంది. కాగా 500 యూనిట్లు పైబడిన వారికి ప్రస్తుతం రూ. 9.05 రూపాయల ఉన్న యూనిట్ ఛార్జీని రూ.9.95గా నిర్ణయించారు. ఈ పెంపు వల్ల కార్పొరేట్ సంస్థలతోపాటు 1.35 లక్షల గృహ వినియోగదారులపై భారం పడనుంది.

 

 

Similar News